Friday, 7 August 2026

ప్రధానమంత్రితో తెలంగాణ సీఎం… సమావేశంలో ఎం జరిగింది?

ప్రధానమంత్రి తనను కలిసిన ముఖ్యమంత్రికి అప్పటికే ఆ రాష్ట్రము గురించి తయారు చేసుకున్న నోట్ ను ఇవ్వడం ఇదే మొదటి సారా? గతంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కలిసినప్పుడు ఇలా రివర్స్ లో నోట్స్ ఇచ్చారా? ఇస్తూ వీటి సంగతి ఏంటి? ఇవన్నీ ఎప్పుడు పూర్తీ చేస్తారు అన్నట్లుగా సంఘటనలు జరిగినట్లు అయితే కనిపించలేదు.

ఈ వార్తను కొన్ని వార్త పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మరి కొన్ని లోపలి పేజీల్లో కనికనిపించంట్లు రాశాయి. అయితే ఈ సంఘటన కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కు అపాయింట్మెంట్ ఇచ్చిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి ప్రధానమంత్రి ఆరాతీయడం చేయాలి లేదంటే తెలంగాణ బీజేపీ నాయకత్వం ఇక్కడ జరుగుతున్నవాటిని నోట్ రూపంలో అందించి ఉండాలి.

రాష్ట్ర నాయకత్వం ఇచ్చినా దానికి ప్రధానమంత్రి సమ్మతి తెలిపి సీఎం కు ఆ నోట్ ఇవ్వడం అనేది ప్రధానమంత్రి కూడా తెలంగాణ విషయంలో ఓ కన్నేసి ఉన్నాడు అనే విషయం అర్థం అవుతుంది. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం కు కేంద్రం నుండి అన్ని రకాల సహాయక సహకారాలు అంత సులభంగా ఉండవు అనేది అర్థం అవుతుంది. ప్రధానిని కలవటానికి ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిసి కులగణన, ఎస్సి వర్గీకరణ గురించి ప్రధానితో మాట్లాడుతాం, చెబుతాం అంటూ చాలా విషయాలు అన్నారు. కాని ఇవేవి ప్రధానమంత్రితో చర్చకు రాలేదు అని తెలుస్తోంది.

ఈ నోట్ ను నేను దాచిపెట్టవచ్చు కాని ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశ్యంతో చెబుతున్నాను అని సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక వేళ సీఎం చెప్పకుంటే పిఎంఓ నుండి సీఎం కు ఇలాంటి నోట్ ఒకటి ఇచ్చారు అని చెబితే అప్పుడు సీఎం పరిస్థితి ఏంటి? ఇది అధికారంగానే పీఎం గారు సీఎం కు ఇచ్చారు కాబట్టి తప్పకుండా బయటికి చెప్పవలసి వచ్చింది అనే విషయం ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా అర్థం అవుతుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు