Friday, 7 August 2026

నిండు ప్రాణం తీసిన పోలీసుల అత్యుత్సాహం

హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలో పోలీసుల అతి చేష్టలకి ఓ నిండు ప్రాణం బలి అయింది. షాపూర్ నగర్ కి చెందిన జోష్ బాబు వృత్తి రీత్యా కార్పెంటర్. తన సోదరుడిని కలిసేందుకు బాలనగర్ తన బైక్ AP 09 AM 6023 మీద వెళుతుండగా బాలానగర్ లో చెకింగ్ చేస్తున్న పోలీసుల్ని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఐతే అతన్ని ఆపే క్రమంలో గోపాల్ అనే పోలీస్ కానిస్టేబుల్ అతని కాలర్ పట్టుకొని గుంజినట్లు, ఆ హడావిడిలో జోష్ బాబు కింద పడిపోగా అప్పుడే అతని పక్కగా వెళుతున్న ఆర్టీసీ బస్ అతని తల మీద నుండి వెళ్లగా అతను అక్కడికక్కడే spot death అయినట్లు సమాచారం.

ఈ సంఘటన చూసి కోపోద్రిక్తులైన సాటి వాహనదారులు పోలీసుల్ని నిలదీస్తూ ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. తమ యూనిఫాం బాడ్జీల మీద పేర్లను ఆందోళనకారులు చూస్తూ పైకి చదువుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బ్యాడ్జీలను తామే స్వయంగా చింపేయటం మొదలుపెట్టారు. అలా అసలు బాధ్యుడైన కానిస్టేబుల్ గోపాల్ పేరు బైటకి వచ్చింది. స్థానికుల ఆందోళన పెరగడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పి గుంపుని చెదరగొట్టారు. “చలాన్ల కోసం ప్రాణాలు తీస్తారా?” అంటూ ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో లోకల్ చానెల్స్ తో మాట్లాడారు. సిసి కెమెరాలు వున్నప్పటికీ వాటిని పోలీసులు తారుమారు చేస్తారేమోనని అనుమానపడ్డారు

యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న జోష్ బాబు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరి ఆందోళన చేపట్టారు. ఇది పోలీసులు చేసిన హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని తమ్ముడు మాట్లాడుతూ తన అన్నకి ఇద్దరు చిన్న పిల్లలున్నారని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆధుకోవాలని, బాధ్యులైన పోలీసుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు.

పోలీసులకి ప్రతి నెలా కేసులు బుక్ చేయడానికి, చలాన్లు రాయడానికి, పెనాల్టీలు వసూలు చేయడానికి డిపార్ట్మెంట్ లో పై అధికారులు కొన్ని టార్గెట్స్ ఇస్తుంటారు. ఆ టార్గెట్స్ ని చేరుకోవాలనే తాపత్రయంలో వేగంగా వెళ్లే బళ్లను ఆపే ప్రయత్నం చేయడం లాంటి అతి చేష్టలకు కింది స్థాయి పోలీసులు పాల్పడుతుంటారు. ఏది ఏమైనా జోష్ బాబు మరణం సామాన్య ప్రజల్లో ఒక తక్షణ స్పందన తీసుకొచ్చింది. పోలీసులకూ కొన్ని హద్దులుంటాయని, ప్రజల్ని నేరస్తుల్లా కాక పౌరుల్లా చూడాల్సిన బాధ్యత వుంటుందని వారికి తరుచూ శిక్షణా నిపుణులతో శిక్షణ ఇప్పించాలి. పౌరులు తప్పులు చేసినంత మాత్రాన వారిపై జులుం, భౌతిక దాడులు చేయకూడదని, చట్ట ప్రకారం కేసులు బుక్ చేయాలని, ఈ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే శాఖాపరంగా తీవ్ర చర్యలుంటాయని వారికి పై అధికారులు అర్ధమయ్యేలా చెప్పాలి. ఎక్కడికక్కడ సిసి కెమెరాల నిఘా నేత్రం వున్నప్పుడు ఇదివరకులా బండ్లని ఆపడం, దబాయించడం చేయడం కాకుండా ‘నాన్-కాంటాక్ట్’ పద్ధతిలో కేసులు బుక్ చేసి, చలాన్లు వసూలు చేసే పద్ధతిని పోలీసులు అనుసరించాలి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు