Friday, 7 August 2026

పోసాని అరెస్ట్.. పెండింగ్ లో మరే హై ప్రయారిటీ కేసులూ లేవా?!

ప్రముఖ తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని AP పోలీసులు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో My Home Bhooja లో నివాసం ఉంటున్న ఆయన్ని ఇంట్లోనే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు రాయచోటి పోలీసులు. అరెస్ట్ కి సహరించకుండా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.

అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణ మురళిపై 352(2) 111 R/W (3)5 బీఎన్ఎస్ యాక్ట్ 2023 సెక్షన్ల కింద కేసు గతంలోనే కేసు నమోదు చేయబడింది. అప్పట్లో సినిమా పరిశ్రమపై చేస్తున్న విమర్శల కారణంగా ఆయనపై వచ్చిన కంప్లైంట్ పై ఇప్పుడు విచారణ జరుగుతోంది. పోసానిని హైదరాబాద్ నుంచి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కి తరలించి, అక్కడినుంచి రాజంపేట కోర్ట్ లో హాజరుపరుస్తారు.

వైసీపీకి పూర్తిగా తన సపోర్ట్ ఇస్తూ, గతంలో టీడీపీ, జనసేన నాయకులని మీడియాముందు తీవ్ర పదజాలంతో పోసాని మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి. ముఖ్యంగా లోకేష్, పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ఎంతో వివాదాస్పదం అయ్యాయి. ఇదే విషయంలో ఆయనపై పలు స్టేషన్స్ లో కూడా కంప్లైంట్స్ నమోదయినట్టు తెలుస్తుంది. చెప్పే విషయంకన్నా మాట్లాడే భాష వల్ల పోసాని కృష్ణమురళి తెలుగు ప్రజలకి ఎక్కువగా గుర్తుండిపోయారు.

ఆంద్రప్రదేశ్ FTVDC చైర్మన్ గా ఆయన గతంలో పనిచేసారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడంతో, ఆయన ఇక ఎటువంటి కామెంట్స్ చేయబోనని ఒక ప్రకటన చేశారు. రాజకీయాలకే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే భయపడి ఇలా చేసారన్న అభిప్రాయం అందరికీ వెళ్లినప్పటికీ, అప్పుడు చేసిన పనులకి శిక్ష తప్పించుకునే అవకాశం ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వట్లేదన్న మరో అభిప్రాయం వినిపిస్తోంది.

ఈ అరెస్ట్ ని రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని పోసాని ఆరోపిస్తున్నారు. ఈ అరెస్ట్ న్యాయమైందే అని కొన్ని వర్గాలు, ప్రతీకార రాజకీయాలు మంచివి కావని భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో లోకేష్ రెడ్ బుక్ లో పేర్లు రాసుకొని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చెప్తామని హడావిడి చేసారు. ప్రస్తుతం పోసాని అరెస్ట్ ప్రతీకారంతో చేయించినదేనని, ఇంతకన్నా ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టకుండా ఈ రెడ్ బుక్ రాజకీయాలు ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. SC/ST అట్రాసిటీ కేస్ లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం సరైందే. ఐతే, వంశీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ని గతంలో కలవలేదని, ఇప్పుడు కలిసానని చెప్తున్నారు. అంటే, ఆయనపై కేస్ లో జగన్ కి కూడా చోటు ఉందని అనుకోవాలా..?! అనుచిత వ్యాఖ్యలు మితిమీరిన కారణంతో అరెస్ట్ చేయాల్సి వస్తే కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయాలి కదా?! నిస్సహాయంగా ఉన్న కారణంగానే పోసాని కృష్ణమురళిని టార్గెట్ చేసినట్లు భావించాలా..?!

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు