Friday, 7 August 2026

ప్రకటనలే తప్ప పంపిణీ ఏదీ? కొత్త రేషన్‌కార్డుల జారీకి ఎన్ని వాయిదాలు?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు దిక్కులేకుండా పోయింది. గత నెల 17న రేషన్‌కార్డుల జారీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి .. ‘కొత్త రేషన్‌కార్డుల జారీకి వెంటనే ఏర్పా ట్లు చేయండి’ అంటూ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాలు జారీ చేసి 15 రోజులవుతున్నా, ప్రభు త్వం ఒక్కటంటే ఒక్క కొత్త కార్డు కూడా మంజూరు చేయలేదు. ఇందుకు సంబంధించి కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం.

ప్రకటనలే తప్ప కార్డుల్లేవు..
కొత్త రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేపు మాపు అంటూ సాగదీత ధోరణి అవలంబిస్తున్నదనే విమర్శలున్నాయి. నిరుడు అభయహస్తం పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. వెంటనే కొత్త కార్డులు జారీ చేస్తున్నంత హడావుడి చేసింది. తాజాగా జనవరి 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నది. ఆ తర్వాత జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. దీనిని సీఎం రేవంత్‌రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. కానీ, ఎవరికీ కార్డులు రాలేదు మరో వారం రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కూడా ముగియనున్నది. ఇ ప్పుడైనా ఇస్తుందో లేక మళ్లీ వాయిదా వేస్తుందోనన్న సందేహాలున్నాయి.

పైలట్‌ గ్రామాల్లోనూ రాలేదు..
జనవరి 26న కాంగ్రెస్‌ సర్కారు రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఎంతో అట్టహాసంగా ప్రారంభించింది. కొన్ని పైలెట్‌ గ్రామాలను ఎంపిక చేసిన సర్కారు.. ఆ గ్రామాల్లో నాలుగు పథకాలను అర్హులైన అందరికీ అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మందికి కొత్త కార్డులు జారీ చేసేందుకు రంగంసిద్ధమైనట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఒక్క కార్డు కూడా జారీ చేయకపోవడం గమనార్హం. కనీసం పైలట్‌ గ్రామాల్లోని అర్హులకు కూడా ఇవ్వలేదు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు