Friday, 7 August 2026

తిరుమల దర్శనాలకు అడుక్కోవడం ఏంటి? : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల దర్శనం కోసం టీటీడీ అధికారులను అడుక్కోవడం ఎందుకని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందని అన్నారు. ప్రతిసారి ఎమ్మెల్యేల లెటర్లు అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని సూచించారు.

‘‘తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, TTD అధికారులను ప్రతిసారీ అడుక్కోవడమేంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? మనకు భద్రాచలంలో రాముడు లేడా..? మనకు శివాలయాలు తక్కువున్నాయా..? తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు మన తెలంగాణలోని దేవాలయాలకు వెళ్లొచ్చు కదా అని అన్నారు.

కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వడంలేదని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని కొందరు నేతలు కోరారు.

అయితే అడుక్కోవడం అని మాట్లాడే బదులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి అందరికి చెందింది. ఇప్పుడు విడిపోయినంత మాత్రాన అక్కడికి వెళ్లడం ఎందుకు ఇక్కడ దేవుళ్ళు లేరా! అని మాట్లాడడం అర్థరహితంగా ఉంది అని మేధావులు, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేది ప్రజలకు సంబందించిన విషయం. రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇక్కడి ప్రజాప్రతినిధుల సిఫారస్ లకు విలువ ఇవ్వాలని అడగడం అనేది అడుక్కోవడం ఎలా అవుతుంది అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు