Friday, 7 August 2026

అసభ్య జర్నలిజం – అరెస్టులు

రైతుబంధు రావట్లేదని ఒక రైతు frustrationతో మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు జర్నలిస్ట్ రేవతి పొగడదండని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉదయం 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో ఆమె ఇంటికి వచ్చారు.
రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్‌లను బలవంతంగా లాక్కెళ్లారు
రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను సైతం సీజ్ చేశారు.

ఒక జర్నలిస్టుని అరెస్ట్ చేయడమంటే మామూలుగా ఆలోచిస్తే పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేయడమే. ఒక యూట్యుబ్బర్ గా ఓ రైతుని తాను పొందుతున్న ప్రభుత్వ పథకాల లబ్ది గురించి అడగటంలో, అతన్నుండి సమాధానం రాబట్టడంలో తప్పేముంది అని మనకి వెంటనే అనిపిస్తుంది. అయితే ఆ ఇంటర్వ్యూలో వృద్ధుడైన రైతు ఉపయోగించిన భాషే దారుణంగా, అభ్యంతరకరంగా, అశ్లీలంగా, దుర్భాషలతో వుంది. జర్నలిజం ప్రమాణాల ప్రకారం చూస్తే ఆ వీడియో ప్రసారానికి అర్హనీయం కాదు. రేవతి ఏమీ కొత్తగా జర్నలిజంలోకి రాలేదు. జర్నలిజానికి సంబంధించిన వృత్తి విలువలు (ప్రొఫెషనల్ ఎథిక్స్) ఆవిడకి తెలియదనుకోడానికి లేదు. వృద్ధాప్య పింఛన్, రైతుబంధుల గురించి ఆవిడ అడగటంతోనే ఆ రైతు సీఎం రేవంత్ రెడ్డి మీద బూతులకు లంకించుకున్నాడు. ఆవిడ వెంటనే అతన్ని హెచ్చరించి వుండాల్సింది. ఒక నిమిషం నిడివి వున్న వీడియో చివరిలో అలా మాట్లాడ కూడదని ఆవిడ అన్నప్పటికీ ఆ రైతు తగ్గలేదు. సరే ఆ రైతు ఏదో తన స్వాభావిక గ్రామీణ సంస్కృతి ప్రకారం మాట్లాడాడే అనుకున్నా ఈమె ఆ వీడియోని విడుదల చేయకుండా వుండాల్సింది. అలా విడుదల చేయడంలో ఆవిడ సెన్సేషనలిజం క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యం వుందా అనే అనుమానం వస్తుంది.

అసలే రాజకీయాలు బూతుమయం ఐపోయిన కాలం ఇది. దీన్ని ఎండగట్టడం ద్వారా ప్రక్షాళనకి పూనుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా జర్నలిజం మీదనే వుంది. అలాంటిది జర్నలిస్టులే ఒక పార్టీ తరపున మరో పార్టీ పై బూతుల దాడి జరిగేలా చేయటం అవాంఛనీయం. ఏ మాత్రం సమర్ధనీయం కాదు. అసలు ఆమె నిజంగా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టుగానే వ్యవహరిస్తున్నారా, ఆవిడ వెనుక ఎవరూ లేరా అనే సందేహం కూడా కలుగుతుంది. వెనుక ఎవరైనా వుండటమంటే ఏమిటో చెప్పాల్సిన పని లేదు. అంటే ఒక పార్టీ తరపున పని చేయటమే. ఊరకనే పని చేయరు కదా? బీఆరెస్ కమ్యూనిస్ట్ పార్టీల్లా ఉద్యమ పార్టీ ఐతే కాదు. కాంగ్రెస్ ఎంతో ఆ పార్టీ కూడా అంతే. ధనం ప్రమేయం లేకుండానే ఇలాంటి వీడియో తయారు చేసి REVATHI జనం మీదకి వదిలారా తెలియాల్సి వుంది ?

బీఅరెస్ పరిపాలన సమయంలో ఇదే రేవతిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అప్పుడు ఆవిడపై విరుచుకుపడ్డ బీఆరెస్ కేడర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని బూతుల బారిన పడేసినందుకు అరెస్టైన రేవతికి మద్దతుగా నిలుస్తున్నారు. అవకాశవాదాన్ని ఓ కళగా రాజకీయ రంగం అధ్యయనం చేస్తుందనటానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు.

పత్రికా స్వేచ్ఛైనా, మరే ఇతర స్వేచ్ఛైనా బాధ్యతలతోనే కూడుకున్నదే. నైతిక ప్రమాణాలకు, హుందాతనానికి, గౌరవానికి కట్టుబడి వుండాల్సిందే. అలాగని ఏదో మరీ తెల్లవారుజామున ఎన్.ఐ.ఏ. ఏజెంట్లలా ఇంటి మీద దాడి చేసి, అరెస్ట్ చేసి, కంప్యూటర్లు, లాప్ టాప్స్ పట్టుకుపోవాల్సినంత అవసరం ఐతే లేదు. కానీ పోలీసులు చేశారు. ఆమెని అరెస్ట్ చేయకుండా నోటీసులిచ్చి హెచ్చరించి వుండాల్సింది.
తాను సీనియర్ Independent జర్నలిస్ట్ అయి వుండి అలా చేయడం సరి కాదు,
ఒక సీనియర్ జర్నలిస్ట్ గా తనకి బేసిక్స్ etiquittes/ రూల్స్ తెలిసివుండాలి లేదా ఇంకా నేర్చుకునే phase లో అయినా వుండివుండాలి.
తాను కావాలని లెక్కలేనితనంతో అయినా చేసుండాలి లేదా ఇంకేదైనా పార్టీ కి favour గా అయినా చేసుండాలి

అసభ్య జర్నలిజానికి, అధికార అభీష్టానికి మధ్య జరిగిన పోరాటం ఎటు పోతుందో చూద్దాం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు