Friday, 7 August 2026

డబీర్ పురాలో టాస్క్ ఫోర్స్ దాడి – కుళ్లిన మాంసం స్వాధీనం!

లక్షన్నర రూపాయల విలువ చేసే రెండు క్వింటాళ్ల కుళ్లిపోయిన మాంసాన్ని భద్రపరిచి, విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డిసిపి, కమిషనర్ టాస్క్ ఫోర్స్ అందె శ్రీనివాసరావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ కి చెందిన కమిషనర్స్, టాస్క్ ఫోర్స్ బృందం, చార్మినార్ జోన్ వెటర్నరీ ఆఫీసర్ తో కలిసి సంయుక్తంగా డబీర్ పురాలోని ఒక ఇంటి మీద దాడిచేసి లక్షన్నర రూపాయిల విలువైన గొర్రె, మేకలకు చెందిన రెండు క్వింటాళ్ల మాంసాన్ని స్వాధీనం చేసుకొని మొహమద్ మిస్బాహుద్దీన్ ని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాంసంలో కుళ్లిన గొర్రె, మేకలకు చెందిన కాళ్లు, తలకాయ, నాలుక, మెదడు భాగాలున్నాయి. ఈ దాడి టాస్క్ ఫోర్స్ కి చెందిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదాబాబు ఆధ్వర్యంలో జరిగిందని ఎక్స్ లో చేసిన ప్రకటన ద్వారా తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు