Friday, 7 August 2026

ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదంలో చిక్కుకున్న 8 మంది మృతి…

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 14వ కిలో మీటర్‌ పాయింట్‌ వద్ద ఈ నెల 22న‌ ఉదయం 8.20 గంటలకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు వచ్చి టన్నెల్‌ బోర్‌ మిషన్‌పై పైకప్పు కూలింది. ఈ క్రమంలో టీబీఎం ముందు భాగంలో పనులు చేస్తున్న ఆరుగురు కార్మికులు, ఇద్ద‌రు ఇంజినీర్లు అందులో చిక్కుకుపోయారు. ఏడు రోజుల నుంచి స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగించారు.
అయితే ఈరోజు వార్తల ప్రకారం ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదంలో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. మూడు మీట‌ర్ల లోతులో రెస్క్యూ టీం మృత‌దేహాల‌ను గుర్తించింది. అధునాత‌న ప‌రిక‌రాలు, రాడార్‌ల‌తో మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు రెస్క్యూ టీం తెలిపింది. మృతుల్లో కార్మికులుఆరు మంది, ఇద్ద‌రు ఇంజినీర్లు ఉన్నారు.

ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌లో ఎనిమిది మంది చిక్కుకున్న ప్రదేశాన్ని జిపిఆర్ఎస్ ద్వారా స్పాట్ చేసినట్టు ప్రాథమిక నివేదిక ద్వారా తెలిసింది. రేడియో తరంగాల ద్వారా కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని క్షుణంగా పరిశీలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నేతృత్వంలో ఉన్నత అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు