Friday, 7 August 2026

కృష్ణా నది మీద కేబుల్ బ్రిడ్జికి కేంద్రం ఆమోదం

సోమశిల వద్ద కృష్ణా నదిపై రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్ల క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జిని చేపట్టాల్సి ఉండగా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇటీవల దాన్ని నేషనల్ హైవేస్ ఒరిజినల్ (ఎన్ హెచ్ ఓ) జాబితాలోకి మార్చడంతో ప్రాజెక్టు మళ్ళీ తెరపైకి వచ్చింది. 800 మీటర్ల నిడివి కలిగి ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణంకు రూ.1,062 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కృష్ణా నది ఇవతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి, అవతల ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ తెలంగాణ – ఏపీ మధ్య మరోమార్గం ఏర్పడనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్గం ద్వారా తెలంగాణ నుంచి తిరుపతికి మధ్య దూరం తగ్గనుంది. తెలంగాణ నుండి ప్రస్తుతం నంద్యాల, తిరుపతికి వెళ్ళాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళకతప్పని పరిస్థితి. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. తెలంగాణ నుండి తిరుపతికి దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

కృష్ణా నదిపై సోమశిల వద్ద ప్రతిపాదిత రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి దేశంలోనే ఇప్పటి వరకు లేని తరహాలో కొత్త డిజైన్ తో రూపుదిద్దుకోనుంది. దేశంలో రెండు వరుసల వంతెనలు అరుదు. అందులోనూ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జితో పర్యాటకులు అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాజుతోకూడిన డిజైన్ తో నడకదారి అనుసంధానించడం ఇప్పటివరకు ఎక్కడా లేదు. తొలిసారి సోమశిల వద్ద రూపుదిద్దుకోనుంది.

నదిపై ఏర్పాటు చేయనున్న బ్రిడ్జి పైభాగంలో నాలుగు వరుసల రోడ్డు ఉంటుంది. దానిమీదుగా వాహనాలు వెళ్తాయి. దిగువన రెండో వరుసలో పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లేలా గాజు ప్యానెల్స్ తో కూడిన డెక్ ఉంటుంది. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కడికి వెళ్లే పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా, ప్రకృతి సోయగాన్ని చూస్తూ గాజు డెక్ నుండి కృష్ణానది వయలని ఆస్వాదిస్తూ వంతెన దాటొచ్చు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు