Friday, 7 August 2026

హైదరాబాద్ వదిలి వెళ్తాం: SRH

IPL 2025 లో భాగంగా SRH (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడగా, ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. విశాఖపట్టణం వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు స‌న్‌రైజ‌ర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ రాసిన లేఖ బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందంటూ, హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లిపోతామని హెచ్చరించారు.

IPL మ్యాచ్ లు జరుగుతున్న వేళ HCA వర్సెస్ స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. IPL ఉచిత టికెట్ల కోసం HCA నుంచి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ఎక్కువవుతుందని ఆరోపిస్తూ HCA కోశాధికారికి స‌న్‌రైజ‌ర్స్ లేఖ రాసింది. ఈ లేఖలో HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసింది. కోరినన్ని పాస్ లు ఇవ్వనందుకు ఓ IPL మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్సుకు తాళాలు వేసినట్లు స‌న్‌రైజ‌ర్స్ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.

సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ లేఖ ప్రకారం. పన్నెండేళ్లుగా HCAతో కలిసి పనిచేస్తున్నాం. కానీ, గత రెండు సీజన్ల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలోHCAకు 10శాతం (3,900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50సీట్ల సామర్థ్యం ఉన్న F12A కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ, ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్ లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై చర్చిద్దామని చెప్పాం. మేము స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం. IPL సమయంలో స్టేడియం మా నియంత్రణలోనే ఉంటుంది. కానీ, గత మ్యాచ్ సందర్భంగా F3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తేగానీ తెరవమంటూ బెదిరించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు