Friday, 7 August 2026

తెలంగాణ CM వ్యాఖ్యలు పదో షెడ్యూల్‌ను ఎగతాళి చేయడమే: సుప్రీం కోర్టు

గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన MLAల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. నిజంగానే నిండు సభలో CM ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే, రాజ్యాంగంలోని (ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించిన) 10వ షెడ్యూలును అపహాస్యం చేయడం కిందికే వస్తుందని జస్టిస్ BR గవాయ్‌, జస్టిస్ AG మాసీహ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

BRS నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన MLAలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. BRS నేత పాడి కౌశిక్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ఆర్యామ సుందరం మార్చి 26న అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా CM చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ ఈ సమయంలో జోక్యం చేసుకుని, జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి కాదన్నారు. దీనికి జస్టిస్ గవాయ్ ఎక్కడో రామ్‌లీలా మైదానంలో అన్నమాటలకు, చట్టసభలో మాట్లాడే మాటలకు తేడా ఉంది.

అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది. సభలో ఒక మంత్రి ఏదైనా ప్రకటన చేస్తే, చట్టాన్ని నిర్వచించడానికి ఆ ప్రకటనను ఆధారంగా చేసుకోవచ్చంటూ గతంలో కొన్ని తీర్పులు కూడా వచ్చాయి అన్నారు. దీనికి రోహత్గీ తాను ముఖ్యమంత్రి తరఫున వాదనలు వినిపించడానికి రాలేదని చెప్పగా, మిస్టర్ రోహత్గీ గతంలో మీరు మరోకేసులో ఇదే CM తరపున వాదనలు వినిపించారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు చెప్పండి, అని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేనివాళ్లతో కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు