Friday, 7 August 2026

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ Central Empowered Committee CEC నివేదిక లో ఏముంది?

 

పర్యావరణపరంగా అడవికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆ భూమికి ఉన్నాయి. TGIIC వివరాల మేరకు 122 ఎకరాల్లో చెట్లను పూర్తిగా వేర్లతో సహా కొట్టేశారు” అని నివేదికలో CEC స్పష్టం చేసింది. వాల్టా చట్టం 2004 ప్రకారం కొన్ని మినహాయింపులున్న చెట్లను కొట్టివేయాలంటే సెల్ఫ్ డిక్లరేషన్‌తో కొట్టివేయొచ్చు. ఇందుకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌కు ఫారం 13ఏ ఇచ్చి, నిర్దేశిత ఫీజు చెల్లిస్తే సరిపోతుందని అటవీ శాఖాధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

CEC మొత్తం 69 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. ఇందులో కంచ గచ్చిబౌలి భూములకు ‘అడవి’ అని చెప్పడానికి కావాల్సిన గుణం ఉందని స్పష్టం చేసింది. ”ప్రాథమిక పరిశీలన ప్రకారం, ఆ ప్రాంత సహజ లక్షణం, పర్యావరణ పరంగా అడవిని తలపిస్తోంది” అని నివేదికలో పలుమార్లు ప్రస్తావించింది. ”ఈ ఏడాది మార్చి 4న అటవీ లక్షణాలు కలిగిన భూములు గుర్తించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా చదును చేసే పనులు చేపట్టారు. వన చట్టం 2023ను పట్టించుకోకుండానే టీజీఐఐసీ చదును చేసే పనులు మొదలుపెట్టింది” అని CEC తన నివేదికలో పేర్కొంది. అలాగే TGIIC కూడా డీపీఆర్ సిద్ధం చేయకుండా నేరుగా అడవి వంటి లక్షణాలు కలిగిన ఆ భూమిని చదును చేయడానికి ముందుకెళ్లిందని సీఈసీ అభిప్రాయపడింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1975లో దాదాపు 2324 ఎకరాలను కేటాయించింది . విశాలమైన ప్రాంతం కావడంతో ఇదంతా పచ్చదనం, చెట్లతో నిండి ఉంటుంది. జింకలు, నెమళ్లు కనిపిస్తుంటాయి. CEC తన నివేదికలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ” ఈ ప్రాంతం పర్యావరణం, పచ్చదనం పరంగా ఉన్నతంగా ఉంది. రాళ్ల అమరికలు, కుంటలు, జీవవైవిధ్యం కారణంగా అక్కడ ఏదైనా పనులు చేయాలంటే కచ్చితంగా గట్టి పరిశీలన జరగాలి. అటవీ చట్టాల ప్రకారం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడమైనా సరే, నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.

TGIIC తమకు యాజమాన్య హక్కులు ఉన్నట్లుగా చెబుతున్నప్పటికీ, అన్ని అనుమతులూ తీసుకోలేదు. భూమిని మార్టిగేజ్ చేయడం కూడా ఆర్థికంగా తీవ్రమైన ఉల్లంఘనగా భావించాలి” అని చెప్పింది.ఈ భూమిని బేకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ పేరుతో మార్టిగేజ్ చేసి నాన్-కన్వర్టబుల్ బాండ్లు జారీ చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏప్రిల్ 10న సీఈసీకి ఇచ్చిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

ఈ భూములపై CEC తన నివేదికలో కొన్ని ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది.

సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి పనులూ మొదలుపెట్టకూడదు. క్షేత్రస్థాయి అటవీ శాఖాధికారులు, వన్యప్రాణుల నిపుణులు, పర్యావరణవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే సంస్థ ప్రతినిధులతో కమిటీ వేసి అటవీ తరహా ప్రాంతాలను గుర్తించాలి. ఈ నేపథ్యంలో TGIIC అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. TGIICకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రద్దు చేయాలి. వివాదాస్పద 400 ఎకరాలు సహా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాన్ని పర్యావరణ సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో సమగ్ర అధ్యయనం చేయించే వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు జరగకుండా నిరోధించాలి.

ఫారం 13ఏ కింద తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిన TGIIC తో పాటు భారీగా చెట్లను కొట్టేసిన కాంట్రాక్టరుపై గట్టి చర్యలు తీసుకోవాలి. అందుకు వాడిన యంత్రాలను జప్తు చేయాలి. ప్రాథమికంగా భూయాజమాన్య హక్కులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నట్లుగా తెలుస్తోంది. TGIIC చెబుతున్నట్లుగా హక్కుల బదలాయింపు పూర్తయ్యిందా.. లేదా అనే విషయంపై లోతైన పరిశీలన జరగాలి. యాజమాన్య హక్కుల గురించి సుప్రీంకోర్టులో తేలే వరకు, భూములను మార్టిగేజ్ చేయడం, లీజు, వాణిజ్య అవసరాలకు వినియోగించడంపై స్టే ఇవ్వాలి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు