Friday, 7 August 2026

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మార్చి 6, 2025న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎస్సీ వర్గీకరణ: ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని నిర్ణయించింది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం 90 పోస్టులను మంజూరు చేసింది. 11 జిల్లాల్లో 104 మండలాలు, 1,355 గ్రామాలతో హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించింది. కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వావలంబన చేయడానికి ‘ఇందిరా మహిళా శక్తి మిషన్-2025’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయడానికి దేవాదాయ చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయించింది. 10,954 గ్రామ స్థాయి అధికారుల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మే నెలలో హైదరాబాద్‌లో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు