Friday, 7 August 2026

తెలంగాణలో రిటైర్ అయిన 6729 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు

తెలంగాణలో ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైర్ అయిన తర్వాత, కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న 6729 మందికి ఉద్వాసన పలకాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో CS ఉత్తర్వులు జారీచేశారు. మునిసిపల్ శాఖలో ఉద్యోగుల్ని తొలగించడంతో విద్యుత్తుశాఖలో మరికొందరు డైరెక్టర్లను తొలగించనున్నారు. ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. రెవెన్యూ, దేవాదాయం, R&B, విద్యాశాఖ, BC సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు సహా అన్ని శాఖలు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

జాబితాలో మెట్రోరైల్‌ MD NVS రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(YTDA) వైస్‌ చైర్మన్‌ G.కిషన్‌రావు, కన్సల్టెంట్‌ ఇంజినీరు BLN‌ రెడ్డి, పదిమంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లున్నారు. వీరి స్థానంలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం ప్రభుత్వంలో సంచలనంగా మారింది.

ప్రభుత్వ నిర్ణయంతో కీలక శాఖలుగా ఉన్న రెవెన్యూ, దేవాదాయం, R&B, విద్యాశాఖ, BC సంక్షేమం, రవాణా, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు ఇలా పలు కీలకశాఖల ముఖ్యఅధికారులు సైతం శాఖల వారీగా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, తొలగించిన వారిలో తిరిగి సేవలు అవసరమని భావిస్తే నోటిఫికేషన్ ద్వారా నియామాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మెట్రో రైల్‌ ప్రాజెక్టును ముందు నుంచి పర్యవేక్షిస్తున్న NVS‌ రెడ్డికి తిరిగి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నిర్ణయం ద్వారా కొత్తగా నియామకాలను అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. గ్రూపు -1 నుంచి గ్రూపు-4 వరకు కొత్త నోటిఫికేషన్ల ద్వారా కొత్తవారికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఉద్యోగుల ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుంది అనే చర్చ సాగుతోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు