Friday, 7 August 2026

అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను అనే తెలంగాణ సీఎం మాటల్లో నిజం ఎంత ఉంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం మీద చేసిన విమర్శలు మరచిపోయారా? గత ప్రభుత్వాన్ని ఎందుకు దించాలో మరచనిపోయారా?

వంద రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పి గ్యారంటీ కార్డులు ఇచ్చింది మీరే కదా. మరి ఇప్పుడు వంద రోజులు ఎప్పుడో అయిపోయాయి కదా మరి అమలు చేయకుంటే అది అబద్దం కాదా? మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అని జాబ్ కాలెండరు ఇచ్చారు అందులో పావు వంతు అంటే 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీచేయలేదు ఇది అబద్దం కాదా?

రైతులకు రైతుభరోసా కిందా ఎకరాకు 15 వేలు ఇస్తాం అని చెప్పి ఇప్పుడు 12 వేలు ఇస్తాం అని చెబుతున్నారు అది అబద్దం కాదా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని చెప్పారు ఇప్పుడేమో 2 లక్షల లోపు ఉన్నవారికి అది ఓక కుటుంబానికి మాత్రమే చేస్తాం అని చెప్పడం అబద్దం కాదా?

అవ్వా తాతా ఈ నెల 2 వేల రూపాయల పింఛను వస్తుంది వచ్చే నెల నుండి నేను నెలకు 4 వేలు ఇస్తాను అని చెప్పి ఇప్పటికి కూడా నెలకు 2 వేలు మాత్రమే ఇవ్వడం అబద్దం కాదా? రాష్ట్ర ప్రభుత్వం కొంత టాక్స్ తగ్గించుకుంటే పెట్రోల్ రేట్ తగ్గుతుంది అని చెప్పి ఇంతవరకు అలంటి ప్రయత్నం చేయడం లేదు ఇది అబద్దం కాదా?

ఇంకా చాల ఉన్నాయి. ఇవన్నీ అమలు చేయకుండా ఇప్పటికి 15 నెలలు గడచిపోయాయి ప్రజలందరు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అని అనుకుంటున్నారు ఇందులో నిజం లేదా? ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలియదా? కాగ్ నివేదిక చదవలేదా? ఆర్బీఐ నివేదికలు చదవలేదా? ఏది తెలియకుండానే హామీలు ఇచ్చారా? ఇన్ని హామీలు ఇస్తున్నారు ఎలా అమలు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న పార్టీ ఇవన్నీ అమలు చేస్తుంది అని ఇప్పటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు విలేఖరులకు చెప్పలేదా? ఇప్పుడు చెప్పండి ప్రభుత్వాన్ని దేని మీద నడిపిస్తున్నారు?

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు