Friday, 7 August 2026

తెలంగాణాలో విద్యుత్తు చార్జీల పెంపు లేనట్టే…

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపుపై సర్కారు వెనక్కి తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాత టారిఫే ఉంటుందని స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పరిపాలన సహా పలు అంశాల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. విద్యుత్తు చార్జీలు పెంచితే అసలుకే మోసం వస్తుందని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాత టారిఫ్‌నే కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని మంగళవారం ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ భవన్‌లో నిర్వహించారు. ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌, జేఎండీ శ్రీనివాసరావు, టీజీఎన్పీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి హాజరయ్యారు. టీజీఎన్పీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ 2025 -26 సంవత్సరంలో చార్జీలు పెంచబోమని ఈ సమావేశంలో ప్రకటించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు