Friday, 7 August 2026

అప్పుల్లో తెలంగాణ రైజింగా…?

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అంటూ ప్రచారం చేస్తోంది. 15 నెలల్లో రూ.1.63 లక్షల కోట్లు అప్పులు చేయడంలో రైజింగా? అని భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్ పై జరిగిన సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు. “RBI నుంచి బాండ్ల రూపేణా అప్పుతెచ్చుకునేందుకు ప్రభుత్వం మంగళవారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోంది. ప్రభుత్వం ప్రతినిమిషానికి రూ.కోటి చొప్పున రుణం తెస్తోంది. ఇది తెలంగాణ రైజింగ్ కాదు, ఫాలింగ్. కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. బడ్జెట్ లో కేవలం 11.50% మాత్రమే మూలధన వ్యయం ఉంది. అలాంటప్పుడు మీరు చెబుతున్నట్లు సమతౌల్యం ఎక్కడుంది.

ఇవీ అప్పుల వివరాలు (రూ.కోట్లలో)…

2023 డిసెంబరు 7 నుంచి 2024 నవంబరు 30 వరకు తెచ్చిన అప్పులు..

FRBM పరిమితిలో తీసుకున్న అప్పు 52,118. కార్పొరేషన్ల పేర తీసుకున్న రుణాలు 61,991. గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్నది 10,000. మొత్తం అప్పు 1,24,109.

2024 డిసెంబరులో తీసుకున్న అప్పు..

డిసెంబర్‌ 3న 2,000. డిసెంబర్‌ 17న 1,500. డిసెంబరు 26న 10,000.

TGIIC ద్వారా..

డిసెంబర్‌ 31న 409. మొత్తం 13,909.

2025లో తెచ్చిన అప్పులు..

జనవరి 7న 3,000. జనవరి 28న 2,800. ఫిబ్రవరి 4న 3,000. ఫిబ్రవరి 4న 1,000.

TUFIDC కోసం..

మార్చి 5న 2,000. మార్చి 11న 3000. మొత్తం 14,800.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు