Friday, 7 August 2026

‘కంచ గచ్చిబౌలి’ స్థలం వేలానికి తెలంగాణ సర్కార్ రెడీ…

హైదరాబాద్‌ ఐటీ హబ్‌కు అతి సమీపంలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదాయన్ని సమకూర్చుకునేందుకు గాను.. ఎకరాకు రూ.50 కోట్ల చొప్పున విక్రయించి మెుత్తం రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ భూమికి సంభందించి మాస్టర్ లే ఔట్ డిజైన్ చేసి విక్రయించేందుకు గాను ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) రంగంలోకి దిగింది. భూముల వేలానికి బిడ్డింగ్ ప్రక్రియ కూడా ఇదివరకే మొదలైంది. ఈ నేపథ్యంలో భూముల వేలంపై పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు.

కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అనేక జంతువులు, వివిధ రకాల పక్షులకు ఆవాసంగా ఉందని అంటున్నారు. ఈ అటవీ ప్రాంతంలో దాదాపు 237 రకాల పక్షులు, అరుదైన స్టార్ తాబేళ్లు, డీర్స్, వైల్డ్ బోర్స్, ఇండియన్ రాక్ పైథాన్, వైపర్స్, కోబ్రాస్, బోయాస్, క్రైట్స్ వంటి జంతువులు, సరీసృపాలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న అర్బన్ ఫారెస్ట్‌లో ఇదీ ఒకటని చెబుతున్నారు. దీన్ని నాశనం చేయటం ద్వారా పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలకు ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారు. అందులోని జంతువులు ఎక్కడికెళ్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో పీకాక్ సరస్సు మరియు బఫెలో సరస్సు కూడా ఉన్నాయి, ఇవి అనేక పక్షులకు ముఖ్యమైన నీటి వనరులు మరియు గూడు స్థలాలుగా పనిచేస్తాయి.

పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అడవిని నాశనం చేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, వాయు కాలుష్యం తీవ్రతరం కావడం, వర్షపాతం తగ్గడం, నగరాల్లోకి స్థానభ్రంశం చెందిన జంతువులు ప్రవేశించడం వల్ల మానవ-వన్యప్రాణుల సంఘర్షణ ప్రమాదం పెరుగుతుంది. ఈ అడవి వాతావరణ మార్పులను నియంత్రించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు భూగర్భ జలాలను తిరిగి నింపడం ద్వారా నీటి భద్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ పచ్చని స్థలాన్ని తొలగించడం వల్ల హైదరాబాద్ వేసవికాలం వేడిగా మారుతుంది, కాలుష్యం మరింత తీవ్రమవుతుంది మరియు నీటి కొరత పెరుగుతుంది. వాతావరణ మార్పు పెరుగుతున్న సంక్షోభంగా ఉన్న సమయంలో, పర్యావరణం కంటే రియల్ ఎస్టేట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం బాధ్యతారాహిత్యం మరియు ఆమోదయోగ్యం కాదు అంటున్న పర్యావరణ నిపుణులు. ఈ పోరాటం కేవలం 400 ఎకరాల భూమి గురించి కాదు – ఇది హైదరాబాద్ భవిష్యత్తు, దాని ప్రజలు మరియు రాబోయే తరాలకు సంబంధించినది.

హైదరాబాద్‌ నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ‘సేవ్‌ సిటీ ఫారెస్ట్’ అనే బృందం ఇప్పటికే కంచ గచ్చబౌలి ఫారెస్ట్ ఏరియాను సందర్శించింది. వారు ఆ భూమిని, అందులోని జీవ జాతులను కాపాడటానికి ఒక ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. న్యాయవాదులు, పర్యావరణవేత్తలతో కలిసి పనిచేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూములను వేలం వేయటానికి తాము ఒప్పుకోమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు