Thursday, 6 August 2026

ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శం: రేవంత్ రెడ్డి

ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ రవీంద్రభారతిలో విశ్వాసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో CMతో పాటు డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం భద్రాద్రి అర్చకులు శ్రీరామనవమి సందర్భంగా CM హాజరు కావాలని కోరుతూ కళ్యాణ పత్రికను అందచేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యూచర్ CT ప్రాజెక్ట్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధికి కొత్త దిశనిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఫ్యూచర్ CT ప్రాజెక్ట్‌ ప్రధానంగా సుస్థిర ఆవాసాలు, అధునాతన సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, మెరుగైన కనెక్టివిటీ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటుందని CM రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పరిశ్రమలు, IT హబ్, విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, వైద్య సదుపాయాలు వంటి విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా, ఫ్యూచర్ CT దేశంలోని ఇతర నగరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు