Thursday, 6 August 2026

పేదల ఇళ్ళే కాకుండా పెద్దల నిర్మాణాలను కూల్చండి – హైడ్రాపై హైకోర్టు సీరియస్​

హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇళ్ళనే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే సర్కారు భూములను రక్షించినట్లు అవుతుందని పేర్కొంది. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ళ ఓనర్లకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్‌ చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలను ఎందుకు తొలగించడంలేదని హైడ్రాను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినప్పటికీ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలిపింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగినచర్యలను తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని, పెద్దలనూ తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని నిలదీసింది. ‘పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫొటోలు వేయించుకోవడం కాదు, దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల ఆక్రమణలనూ తొలగించినపుడే ప్రజాప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుంది’ అని పేర్కొంది. మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలుంటే తొలగింపునకు చర్యలు తీసుకోవచ్చంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు