Friday, 7 August 2026

16 ఏళ్ళ లోపు పిల్లలు రాత్రి 11 తరువాత సినిమాకు వెళ్ళవచ్చు-తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో మల్లీప్లెక్స్ థియేటర్లకు ఊరట లభించింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉతర్వులను సరిచేస్తూ తాజాగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై ఇటీవల దాఖలైన పటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది.

ఈ విషయంపై అన్నివర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. జనవరి 21న హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అయితే, తాజాగా ఆ తీర్పును సవరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మల్లీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పిటిషన్ లో మల్లీప్లెక్స్ యాజమాన్యం కోరింది.

తాజాగా.. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా నష్టపోతుందన్న పిటీషనర్ల వాదనను పరిగణలోకి తీసుకుంది. దీంతో.. పదహారేళ్లలోపు పిల్లలను రాత్రి 11 గంటల తరువాత ఉదయం 11గంటల లోపు థియేటర్లలోకి అనుమతించొద్దన్న తీర్పును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు