Friday, 7 August 2026

కంచ గచ్చిబౌలి సంఘటనలో నకిలీ ఫొటోలు, వీడియోలపై రేవంత్ రెడ్డి సీరియస్‌

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో కృత్రిమ మేధ (AI) ఆధారిత నకిలీ వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న తీరు పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే AI ఫేక్ కంటెంట్‌ తయారీపై విచారణకు ఆదేశించాలనే ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, రాష్ట్రంలో సైబర్‌క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నకిలీ వీడియోలు, ఫొటోలను గుర్తించే విధంగా అవసరమైన ఆధునిక ఫోరెన్సిక్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సూచించారు.

శనివారం ఆయన కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, CS శాంతికుమారి, DGP జితేందర్‌, TGIIC MD విష్ణువర్ధన్‌ రెడ్డి, అటవీశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కృత్రిమ మేధతో తయారు చేసిన నకిలీ వీడియోలు, ఫొటోలు కరోనాను మించిన మహమ్మరిలాంటివి అని, ఇండో-పాక్‌, ఇండో-చైనా వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాలలో AIతో ఫేక్ కంటెంట్‌ను సృష్టించడానికి ప్రమాదం ఉందని చర్చ జరిగింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కున్నట్టుగా సోషల్ మీడియా నెట్‌వర్క్‌ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై CM స్పందిస్తూ, ఫేక్ కంటెంట్‌ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు CM రేవంత్‌కు పలు కీలక విషయాలను వెల్లడించారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్‌ అబ్రహం, దియా మీర్జా, రవీనా టాండన్‌ వంటి వారు కూడా AI ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోలను పోస్టుచేసి సమాజానికి తప్పుడు సందేశాన్ని చేరవేశారని సమావేశంలో చర్చించారు. అయితే ఈ భూముల వివాదంపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లలోనే తన పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పారని, మిగతా ప్రముఖులు ఎవరు ఈ నిజాన్ని గుర్తించకుండా ఫేక్ వీడియోలను ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు.

మొత్తంగా, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో AI సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెద్ద సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు