Friday, 7 August 2026

తెలంగాణ ఫిరాయింపు MLAల అనర్హత పై సుప్రీంకోర్టులో ఏం జరిగింది?

తెలంగాణ MLA అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. MLAల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ BR గవాయ్ స్పష్టం చేశారు. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పందించిన జస్టిస్ గవాయ్ ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు.

BRS కు చెందిన MLAలు పార్టీ మారిన వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని, ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశముంటుందని ముకుల్ రోహత్గీ కోర్టులో వాదించారు. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని రోహత్గీ తెలిపారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వాదనలు వినిపించారు.

రోహత్గీ వాదనలపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడం లేదా ఆదేశించడమో చేయలేమా అని వ్యాఖ్యానించారు.

దీనిపై రోహత్గీ స్పందిస్తూ, MLAలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో కొన్ని పిటిషన్లు న్యాయస్థానంలో వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ, కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు.

ముకుల్ రోహత్గీ వాదనలపై జస్టిస్ BR గవాయ్ జోక్యం చేసుకుని, న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని చెప్పారు. నాలుగేళ్ల పాటు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, కోర్టులు చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. ఫిరాయింపుపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని రోహత్గీ చెప్పారు. 10 మంది MLAలకు నోటీసులు జారీ చేసి, స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన కోర్టుకు వివరించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు