Friday, 7 August 2026

మా వద్ద ఆలస్యం చేసే ఎత్తులు వేయవద్దు: తెలంగాణలో పార్టీమారిన MLA లకు Supreme Court చివాట్లు

తెలంగాణలో పార్టీ మారిన MLA లపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్ పై ఇవాళ Supreme Court లో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ (Justice Gavai) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పదవీ కాలం పూర్తయ్యేవరకు అది రీజనబుల్ టైమ్ అవుతుందా అని ప్రశ్నించింది. ఈ అంశంలో మొదటి ఫిర్యాదు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. నిర్ణయం తీసుకోవడానికి తగిన టైమ్ అంటూ ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శేషాద్రినాయుడు, అర్యమా సుందరం వాదనలు వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హత పిటిషన్ విచారణార్హతను పరిశీలించాలి. అర్హత లేకపోతే పిటిషన్ ను డిస్మిస్ చేయాలి. విచారణార్హత ఉంటే స్పీకర్ నోటీసులు ఇవ్వాలని సుందరం వాదించారు. స్పీకర్ నోటీసులకు వారంలోగా సమాధానం ఇవ్వాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం న్యాయసమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంది. ముగ్గురు MLA లకు నోటీసులు ఇచ్చాక వారంలో సమాధానం ఇవ్వాలన్న నిబంధన ఉంది. కానీ వారు 4 నెలల సమయం కోరారు. మన దేశంలో ప్రజాస్వామ్యం మరింత ఎక్కువగా ఉందని స్పీకర్ నిర్ణయం తీసుకునేవరకు న్యాయసమీక్ష చేయొద్దంటున్నారని సుందరం కోర్టుకు వివరించారు. స్పీకర్ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోవడంలేదు. ఇది న్యాయసమీక్ష కాదు, జోక్యం కూడా కాదు. కేవలం స్పీకర్ విధులు నిర్వర్తించాలని మాత్రమే కోర్టు చెబుతోందని సుందరం అన్నారు.

దీంతో న్యాస్థానాలు చేతులు కట్టేయడం కుదరదని న్యాయస్థానం బదులించ్చింది. సుభాశ్ దేశాయ్ కేసును ఉదహరించిన సుందరం.. ఆ కేసులో నిర్ణీత సమయం కేటాయించింది. గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు తర్వాత షెడ్యూల్ ఖరారు చేయలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా, లేదని అడ్వకేట్ సందరం సమాధానం చెప్పారు. ముగ్గురు MLA లపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని పేర్కొన్నారు. స్పీకర్ స్పందించి నోటీసులు కూడా ఇవ్వలేదని ఒక MLA కాంగ్రెస్ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా BRS లోనే ఉన్నామంటున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయినా స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదు. ఆ తర్వాత ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటిసులు ఇచ్చారని తెలిపారు. 3 వారాల్లో రిప్లె ఇవ్వాలని ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసు ఇచ్చారు. ఇప్పటికి మూడు వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదన్నారు. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోవాలని మేము కోరుకోవట్లేదు. స్పీకర్ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని కోరుతున్నామని న్యాయవాది సుందరం కోర్టులో వాదించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరిన ప్రతిపాదులైన MLA లపై ధర్మాసనం సీరియస్ అయింది. తమ దగ్గర డిలే ట్యాక్టిక్స్ అమలు చేయవద్దంటూ మండిపడింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు