Friday, 7 August 2026

తెలంగాణ ఎమ్యెల్సీ ఎన్నికలు…

తెలంగాణలోని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయం సాధించారు. ఇక నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయాన్ని అందుకొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ గెలుపు ఆయన సొంతమైంది. అలాగే వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. మార్చి 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి.

వాటికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మార్చి 3వ తేదీ ఉదయం ప్రారంభమైంది. వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఇక 2 ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అదే విధంగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ఈ రోజు జరుగుతోంది.

వీటిలో రెండు స్థానాల ఫలితాలు తేలిపోయాయి. వాటి విజేతలు ఎవరో స్పష్టత వచ్చేసింది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే కౌంటింగ్ సైతం కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారి బీజేపీ బోణి కొట్టింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందారు. కొమురయ్యకు 12,959 ఓట్లు పోలైయ్యాయి. ఇక 12081 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కొమురయ్య అవలీలగా దాటారు.

ఇక ఈ ఎన్నికల బరిలో నిలిచిన వంగ మహేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమార్‌కు 2621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు పోలైయ్యాయి. ఇక నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాలరెడ్డి విజయాన్ని అందుకొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. ఆయన 11, 800 ఈ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు