Friday, 7 August 2026

పార్టి కోసం పని చేసిన వారికే పదవులు: మీనాక్షి నటరాజన్

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) రాష్ట్ర కార్యవర్గం ఎంపిక మళ్లీ మొదటికొచ్చింది. ఇంతకాలం పేర్లు దాదాపు ఖరారైపోయాయని, నేడో, రేపో ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పీసీసీ కార్యవర్గం ఎంపిక తీరు మారింది. జిల్లాల వారీగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారెవరనేది తొలుత గుర్తించాలని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయినందున గతంలో, ఇప్పుడు పార్టీ నమ్ముకుని పని చేస్తున్నవారికి పదవులివ్వాలని కొత్త ఇన్ఛార్జి సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలు, ఇతరత్రా పలుకుబడి ఉన్నవారు పీసీసీలో కీలక పదవులు దక్కించుకునేందుకు గత మూణ్నెల్లుగా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వారిలో ఎవరిని ఎంపిక చేయాలనేది రాష్ట్ర నేతలకు కష్టంగా ఉండేది. కానీ రాహుల్ గాంధి ఆదేశాలతో రంగంలోకి దిగిన మీనాక్షి.. పార్టీ అధిష్ఠానం ఇచ్చే సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ పదవుల పందేరం చేపట్టాలని చెప్పినట్లు సమాచారం. ఒక్క పీసీసీకే కాకుండా.. మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా జిల్లాల వారీగా చేయనున్నారు.

అర్హులైన పార్టీ నేతలను గుర్తించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు పీసీసీ సూచించింది. వారు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చిస్తున్నారు. అనంతరం పేర్లతో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఇవన్నీ అందాక పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చర్చించి పీసీసీ రాష్ట్ర కార్యవర్గానికి తుది ప్రతిపాదనలు ఖరారు చేసి అధిష్ఠానం ఆమోదం కోసం పంపుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యక్రమాలను సైతం విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు