Friday, 7 August 2026

నిధుల కోసం భూములు అమ్మాలి : కాంగ్రెస్‌ ప్రభుత్వం

400 ఎకరాల టీజీఐఐసీ భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయం, గచ్చిబౌలి స్థలం అమ్మకానికి ఏర్పాట్లు, 20 వేల కోట్ల సమీకరణకు నిర్ణయం, కన్సల్టెంట్‌ నియామకానికి టెండర్లు, బిడ్ల దాఖలుకు 15వ తేదీ వరకు గడువు, గతంలో అదే జాగను సర్కారు తనఖా, ఖజానాలో కాసులు లేక ఆపసోపాలు, విలువైన భూములను అందినకాడికి అమ్ముకునేందుకు సర్కారు యత్నం.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం పరిధిలో టీజీఐఐసీకి చెందిన 400 ఎకరాల భూములను విక్రయించేందుకు యత్నిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి లేఔట్‌ను ఏర్పాటు చేసి వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్‌ నియామకానికి (ఆర్‌ఎఫ్‌పీ) టెండర్లు పిలిచింది. లేఔట్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేలం ద్వారా ప్లాట్ల విక్రయాలు తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం లావాదేవీ సలహా కన్సల్టెంటు నియామకానికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ని ఆహ్వానించారు.

ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువిచ్చారు. క్వాలిటీ కమ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌ (క్యూసీబీఎస్‌) పద్ధతిలో బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే.. ఇవే భూములను బ్యాంకర్లకు కుదువ పెట్టి రూ.10 వేల కోట్ల రుణాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం గతంలో యత్నించింది. ఒక కన్సల్టెంట్‌ను నియమించింది. 400 ఎకరాలను ప్రైవేటు బ్యాంకులకు కుదువపెట్టి నిధులు సమీకరించుకుంది. ఆ సమయంలో జరిగిన ఒప్పందంలో ఒక క్లాజ్‌ పెట్టారు. తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఇవే భూములను విక్రయించి అప్పు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. అనుకున్నట్టే ఇప్పుడు ఇవే భూములను అమ్మడానికి సిద్ధమైంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు