Friday, 7 August 2026

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ బోర్డు) పరిధిలో అన్యమతస్తులను తొలగిస్తున్న బోర్డు.

ఏపీలో తిరుమల టీటీడీ బోర్డు పరిధిలో అన్యమతస్తులు పనిచేయకుండా తొలగిస్తామని గతంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ ఓ విద్యాసంస్ధలో ప్రిన్సిపాల్ స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జి.అసుంతను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తూ పూజ చేయకుండా, హారతి ఇవ్వకుండా, తీర్థ ప్రసాదాలు తీసుకోని అసుంతపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆమెను డిప్యూటేషన్ పై నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది. టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వైఎస్ హయాంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగుల్ని టీడీడీలో నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి తొలగింపుకు ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు