Friday, 7 August 2026

ప్రమాదవశాత్తు కారులో ఇరుక్కుపోయి ఇద్దరు చిన్నారులు మృతి

రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, దామరగిద్ద గ్రామంలో సోమవారం రోజు తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారులో ఇరుక్కుపోయి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలారు. బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు గానూ అక్కాచెల్లెల్లు తమ పిల్లలను తీసుకుని అమ్మగారింటికి వచ్చారు. ఇదే సమయంలో ఇంటి ముందు కారు ఆపి ఉండగా.. ఆ అక్కాచెల్లెల్ల పిల్లలైన తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4).. ఆడుకుంటూ వెళ్లి అందులో ఎక్కారు. అయితే.. కారు డోర్లు వేసుకోవటంతో అటోమెటిక్‌గా లాక్ అయిపోయిన విషయం ఆ చిన్నారులకేం తెలుసు.. ఆటలో మునిగిపోయారు. కాసేపటివరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఊపిరాడక ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు. పైనుంచి ఎండ విపరీతంగా కొడుతుండటంతో.. చిన్నారులు కాసేపటికే స్పృహ కోల్పోయారు.

సుమారు అరగంట కావొస్తున్న ఇంట్లో పిల్లలు కనిపించకపోవటంతో.. ఎండలో ఆడుతున్నారా ఏంటీ అని బయటికొచ్చి చూస్తే ఎక్కడా కనిపించలేదు. ఎటు వెళ్లారా అని చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఈ క్రమంలో కారులో చూడగా.. ఆ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే కారు డోర్లు తీసి.. పిల్లలును హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అప్పటికే ఇద్దరి ఊపిరి ఆగిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

ఈ హృదయ విదారక ఘటనతో ఆ కుటుంబంలోనే కాదు.. దామరగిద్ద గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డోర్లు ఎలా లాక్ అయ్యాయి, ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని నింపింది. వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన అక్కాచెల్లెల్లు తల్లిగారింటికి వచ్చి కాసేపు సంతోషంగా గడపుదామనుకుంటే.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితంలో తీరని విషాదం చోటుచేసుకోవటం అందరినీ కలచివేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనే ఏపీలో జరిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే జరిగి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు