Friday, 7 August 2026

HCU లో కుప్పకూలిన నిర్మాణం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) లో నిర్మాణంలో ఉన్న నూతన పరిపాలన భవనం బాల్కనీ స్లాబ్‌ కుప్పకూలింది.

గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు హెచ్‌సీయూకి చేరుకుని నేలమట్టమైన స్లాబ్‌లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇవాళ ఉదయం నుంచి విశ్వవిద్యాలయంలో Universty Of Hyderabad Students Union విద్యార్థులందరు క్లాసెస్ ను Boycott చేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

కార్మికులకు కావల్సిన వైద్య ఖర్చులు పరిపాలనా విభాగమే భరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేట్ పూర్తయ్యే వరకు విశ్వవిద్యాలయంలో ఇంకే నిర్మాణాలు జరిగేది లేదంటూ
ఆందోళనను కొనసాగిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు