Friday, 7 August 2026

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు నిముషానికి 90 వేలు?

ఒక నిమిషం వీడియోకు రూ.90వేలు చార్జ్‌ చేశామని, ఇలా సుమారు 15 వీడియోలు ప్రమోట్‌ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసిన విష్ణుప్రియ, రీతూచౌదరిలు గురువారం పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ ఇద్దరిని రాత్రి తొమ్మిదిగంటల వరకు పోలీసులు విచారించారు. విష్ణుప్రియను సుమారు పదిగంటలపాటు, రీతూ చౌదరిని ఆరుగంటలపాటు పంజాగుట్ట డిఐ శ్రవణ్‌ ఆధ్వర్యంలో విచారించారు.

ఇద్దరి బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ ద్వారా వచ్చిన నిధులపై ఆరా తీశారు. ఈ క్రమంలో వారెన్నెన్ని వీడియోలు చేశారు, ఒక్కో వీడియోకు ఎన్ని డబ్బులు తీసుకున్నారు అని అడిగారు. ప్రమోషన్‌ చేయడానికి వారిని ప్రోత్సహించిందెవరంటూ పోలీసులు ప్రశ్నించారు. గురువారం విచారణ పూర్తిఅయిన తర్వాత ఈ ఇద్దరిని ఈనెల 25న మళ్లీ విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు టేస్టీతేజా, కానిస్టేబుల్‌ కిరణ్‌లను పోలీసులు విచారించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు