Friday, 7 August 2026

ఏప్రిల్ 1 నుండి UPI సరికొత్త రూల్స్

UPI వాడేవారికి కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి. వాడుకలో లేని మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుండి UPI సేవలు ఆగిపోతాయి. అంటే ఇనాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన నంబర్లు ఈ కేటగిరిలోకి వస్తాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. మోసాలను అరికట్టడానికి ఈ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. ఇదే సమయంలో UPI లైట్ వాలెట్‌లో లోడ్ చేసిన డబ్బును మళ్లీ బ్యాంకు అకౌంట్‌కు పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుండి అందుబాటులోకి వస్తుంది.

TDS, TCS నిబంధనలు:

TDS, TCS నిబంధనల్లో కూడా మార్పులు రానున్నాయి. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడిన వారికి) బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వార్షిక వడ్డీ రూ.50,000 దాటితే, గతంలో TDS వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిమితిని రూ.1 లక్షకు పెంచారు. సాధారణ ప్రజలకు ఈ పరిమితి రూ.40,000 నుండి రూ.50,000 వరకు పెరిగింది.

విదేశాలకు డబ్బు పంపేవారికి కూడా ఒక వెసులుబాటు కల్పించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే TCS వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. విద్యార్థుల చదువు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఫీజు కోసం విదేశాలకు పంపితే, TCS ఉండదు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు