Friday, 7 August 2026

పోలీస్ ఉద్యోగుల పిల్లల కోసం “Young India Police School”!

తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో “Young India Police School” ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలోతెలిపారు. పోలీసుల వృత్తి ధర్మం, విధుల స్వభావం వల్ల కుటుంబ విషయాలు, పిల్లల చదువు వంటి విషయాల మీద దృష్టి పెట్టలేనందున ఈ స్కూల్ లో 50% సీట్లు పోలీస్ అమరవీరులు, హోం గార్డ్స్ నుండి ఐపిఎస్ ఆఫీసర్ల పిల్లల వరకు రిజర్వ్ చేయబడి వుంటాయని, యాభై శాతం సీట్లు సివిలియన్స్ కి వుంటాయని, ఫీ స్ట్రక్చర్ తల్లిదండ్రులకు ఎంతో అనువుగా వుంటుందని ఆయన అన్నారు. స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో CBSE Core Curriculum తో నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. విద్యార్థి యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా అకడమిక్స్, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ వుంటాయని సివి ఆనంద్ తెలిపారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి ఇదొక గొప్ప అవకాశమని, వెంటనే అప్లై చేయాలని ఆయన ఆ వీడియోలో తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు