Friday, 7 August 2026

భారత్‌లో మిలియనీర్ల సంఖ్య: 85,698

దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. నిరుడితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ ‘నైట్‌ ఫ్రాంక్‌’ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం మిలియనీర్ల సంఖ్య 85,698కు చేరుకొన్నట్టు వివరించింది.

పది మిలియన్‌ డాలర్ల కంటే (రూ. 87 కోట్లు) ఎక్కువ సంపద కలిగి ఉన్నవారిని మిలియనీర్లుగా పిలుస్తారు. ఇదిలా ఉండగా కుబేరులు ఎక్కువగా పశ్చిమ దేశాల్లోనే ఉంటారనుకొంటాం. అయితే, సంపన్నులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో టాప్‌-3లో ఇండియా కూడా ఉన్నట్టు ‘నైట్‌ ఫ్రాంక్‌’ నివేదిక వెల్లడించింది. కనీసం రూ. 8,500 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగినవారిని బిలియనీర్లుగా పిలుస్తాం. కాగా ప్రపంచంలోని మొత్తం కుబేరుల సంపద విలువ ఏకంగా రూ.1,275 లక్షల కోట్లకు చేరింది.

దేశంలో 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, 217 మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇక, 104 మంది సంపన్నులతో హైదరాబాద్‌ ముచ్చటగా మూడో స్థానాన్ని దక్కించుకొన్నట్టు హురున్‌ ఇండియా రిచ్‌లిస్ట్‌-2024 నివేదికలో వెల్లడించింది. మొత్తంగా తెలంగాణలో 109 మంది, ఏపీలో 9 మంది సంపన్నులు ఉన్నట్టు నివేదిక వివరించింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు