Friday, 7 August 2026

35 చిన్న కథ కాదు

పిల్లల దృక్కోణం నుండి తీసిన “35” సినిమా బాగుంది. చదువు సరిగ్గా రావడం లేదని గొణిగే తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా. తల్లిదండ్రులంటే వండి పడేయడం, స్కూలు ఫీజులు కట్టడం కాదని పిల్లల మనస్తత్వాన్ని ఎరిగి తమని తాము కొత్తగా మలుచుకోవాలని చెప్పిన సినిమా. పిల్లల పరిమితుల్ని తెలుసుకోకుండా కేవలం మార్కుల ద్వారా వారిని ప్రేమీంచి, ప్రోత్సహించే పంతుళ్లు కూడా చూడాల్సిన సినిమా. నటనపరంగా చూస్తే అరుణ్ గా వేసిన అబ్బాయి అసలు నటించనేలేదు. కేవలం ప్రవర్తించాడంతే. నివేద థామస్ ఒక మంచి ఆర్టిస్టని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. ప్రియదర్శి తన సటిల్ పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచాడు. అతనిది వర్తమాన బోధనా వ్యవస్థ దౌర్బల్యాన్ని ఎత్తి చూపే పాత్ర. పిల్లాడి నాన్నగా విశ్వదేవ్ బాగా చేశాడు. పిల్లాడి స్నేహితురాలిగా వేసిన అమ్మాయి చాలా లైవ్లీగా వుంది. ఆర్టిస్టుల నుండి దర్శకుడు మంచి నటన రాబట్టుకున్నాడు.

అంతా బాగానే వుంది కానీ సినిమాలో బ్రాహ్మణ్య నేపథ్యాన్ని హైలైట్ చేయడం చాలా అనవసరం అనిపించింది. పిల్లవాడికి తిరుపతిలో గుండు కొట్టిస్తున్నప్పుడు మేనమామ పిలక పెట్టమని చెప్పడం, నివేద సాంప్రదాయ పద్ధతిలో కాసె పోసి చీర కట్టడం, అన్నేసి సార్లు “శ్రీపతి పండితారాధ్యుల” అంటూ ఇంటి పేరు చెప్పుకోడం, గోత్ర నామాలు వల్లించడం, పిల్లాడిని లెక్కల సబ్జెక్టుతో పనిలేని వేద పాఠశాలలో చేర్పిస్తాననడం వంటివి అనవసరం. నాకైతే ఇదంతా కథకి సంబంధం లేని “కేస్ట్ గ్లోరిఫికేషన్” అనిపించింది. ఎందుకంటే ఇది అన్ని కులాల కథ. మిగతా సినిమా అంతా బాగుంది.

మొత్తం మీద చూడదగ్గ సినిమా! “అహా”ఓటిటిలో వుంది.

~ అరణ్య కృష్ణ

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు