Saturday, 8 August 2026

బాలచందర్ గారి పాత్రల పద్ధతి!

నాకు బాలచందర్ గారి సినిమాల్లో బాగా నచ్చిన మొదటి సినిమా ‘గుప్పెడు మనసు’.. రెండో సినిమా ‘ఇది కథ కాదు’. భర్త భార్యపై చూపే హింస అనే పాయింట్ ఉన్న కథల్లో నేను చిరాకుపడే అంశం అసహజ విలనిజం. భర్త అనేవాడు ఎంత క్రూరుడైనా బేసిగ్గా ఒక మనిషి. సమాజంలో కొంత గౌరవం ఉండే వ్యక్తి. అలాంటి వాడిని మరీ నరరూప రాక్షసుడిగా చూపిస్తారు కొందరు. సాడిజం కాస్తా విలనిజంగా మారుతుంది. ఒకోసారి చాలా కామ్‌గా ఉండే మగవారు కూడా ఇళ్లల్లో తమ భార్యల్ని బాధలు పెట్టే ఉదంతాలు నాకు తెలుసు. సరిగ్గా ఈ సినిమాలో చిరంజీవి అలాంటి పాత్రే చేయడం నాకు నచ్చింది.

కథైనా, సినిమా ‌అయినా రచయిత/దర్శకుడు కాకుండా పాత్రలు ఎక్కువగా మాట్లాడాలి అనేది నా మాట. ఈ విషయాన్ని నూటికి నూరు శాతం నేను ఎక్స్‌పీరియన్స్ చేయగలిగేది బాలచందర్ గారి సినిమాల్లో. అందుకే మనకు ఆ క్యారెక్టర్స్ చాలా బాగా గుర్తుంటాయి. పైగా ఆయన పాత్రలు ఎక్కువగా అరవడం, దెబ్బలాడటం లాంటివి చేయవు. చాలా కామ్‌గా తమ పని తాము చేసుకుపోతూ ఉంటాయి. ఈ సినిమాలో జయసుధ పాత్ర తాలూకు బాధలన్నీ మనకు చూపే క్రమంలో కూడా ఆమె ఏడవడం(కంటతడి మాత్రం పెడుతుంది.. అది ఏడుపు కాదు), గుండెలు బాదుకోవడం లాంటివి చూపలేదు. నాకు తెలిసి బాలచందర్ గారి సినిమాల్లో Protagonist Women Characters తక్కువగా ఏడ్చారు. వీలైనంత అర్థవంతమైన సన్నివేశాల్లో మాత్రమే ఏడ్చారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో మాత్రమే జయసుధ జరిగిన అన్నింటికీ కలిసి ఏడుస్తారు.

Balachander Heroines are mostly working Women and Liberal. 1980 కాలంలో హీరోయిన్ నేచర్ చూపుతూనే వారిని Working Womenగా చూపడం నాకు పర్స‌నల్‌గా చాలా నచ్చుతుంది. ఇందులో కూడా జయసుధ Single Parent and Working Women. 1977 నాటి కాలానికి అది కొంచెం కొత్త. వింత. అప్పటికే మొదలైన Baby Care Centers గురించిన సన్నివేశం కూడా ఈ చిత్రంలో ఉంది. జయసుధ ఒకర్ని ప్రేమించడం, మరొకర్ని పెళ్లాడటం, ఇంకొకరు ఆమెను ప్రేమించడం.. ఇదంతా డిస్కస్ చేయడంలో పెద్దగా నాకు ఆసక్తి లేదు కానీ, Designing the Characters విషయంలో ఇప్పటికీ బాలచందర్ గారు లెజెండ్! ఈ చిత్రంలో నాకు చిరంజీవి అమ్మగా నటించిన లీలావతి గారి పాత్ర చాలా ఇష్టం. దాదాపు 600 సినిమాలు చేసిన సీనియర్ నటి ఆమె.

ఒక సన్నివేశం చెప్తా! తనకు అవమానం జరిగిందన్న కోపంతో జయసుధను డ్యాన్స్ మానేయమంటాడు భర్త. “మిమ్మల్ని కట్టుకున్నాక బతుకులో తీయనైనవి ఎన్నో పోగొట్టుకున్నాను. అందులో ఇదీ ఒకటి” అని జయసుధ డైలాగ్ చెప్తుంది. తర్వాత కాళ్ల గజ్జెలు విప్పడం, గోడ మీదున్న ఫొటో మీద మరక పడటం, టేప్ రికార్డర్‌లో జతి(నాట్యసంగీతం) వింటూ ఉండటం కనిపిస్తాయి. ఎంత సింపుల్‌గా ఆమె బాధ తాలూకు ఎమోషన్ని చూపించారో చూడండి. అందుకే బాలచందర్ గారి సినిమాల్లో డ్రామా ఉన్నా, అది భరించలేని మెలోడ్రామాగా మారదు.

ఇదే సినిమా ముందు తమిళంలో ‘అవర్‌గల్’గా చేశారు. సుజాత ప్రధాన పాత్ర పోషించగా, సాడిస్ట్ భర్తగా రజనీకాంత్ నటించడం విశేషం. కమల్‌హాసన్ అక్కడా ఇక్కడా ఒకే పాత్ర వేశారు.

“ఆదీన స్త్రీల రోదనం, వేదన నా చెవుల్లో గింగురుమంటున్నాయి – చలం” ఈ వాక్యంతో సినిమా ముగుస్తుంది. బహుశా స్త్రీకి పురుషుని నుంచి వేదన ఎప్పటికీ తప్పదు అన్న అర్థంతో ఈ వాక్యం పెట్టారేమో బాలచందర్ అనిపిస్తుంది.

~ సాయి వంశి

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు