Friday, 7 August 2026

ప్రభుత్వోద్యోగి మీద దాడిచేసిన ప్రజాప్రతినిధి

అస్సాం కి చెందిన గిరిజన ప్రజాప్రతినిధి వంతెన ప్రారంభోత్సవంలో తనకు నచ్చిన రంగు రిబ్బన్ ఏర్పాటు చేయలేదని ప్రభుత్వోద్యోగిపై అమానుషంగా దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ ప్రజాప్రతినిధి తన అభిమాన రంగు రిబ్బన్ కట్టకపోవడాన్ని సీరియస్ గా తీసుకొని అక్కడే ఉన్న ప్రభుత్వోద్యోగి చెంపమీద బలంగా కొట్టి, అంతటితో ఊరుకోకుండా అక్కడే వున్న అరటి బోదెతో బహిరంగంగా దాడిచేశాడు. ఈ చర్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అధికార వర్గాలు దీనిపై స్పందిస్తూ, బాధిత అధికారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చాయి.

ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజాసేవకులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇలా అధికార దుర్వినియోగం చేయడం ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకమని నెట్టిజన్లు మండిపడుతున్నారు. ఆ ప్రజాప్రతినిధిపై చర్య తీసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు