Friday, 7 August 2026

పీరియడ్స్ కారణంగా దళిత విద్యార్థిని తరగతి గది బయట పరీక్ష రాయించిన యాజమాన్యం

పీరియడ్స్ కారణంగా దళిత విద్యార్థిని తరగతి గది బయట పరీక్ష రాయించిన యాజమాన్యం

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కినతుకడవు తాలుకా షెడ్యూల్డ్ కులానికి (SC) చెందిన విద్యార్థిని స్థానికంగా ఉన్న Swamy Chidbhavananda Matriculation Higher Secondary School లో 8వ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలికకు ఏప్రిల్ 5వ తేదీన తొలిసారి రుతుస్రావం అయింది. దీంతో తల్లిదండ్రులు బాలికను రెండ్రోజులు ఇంటి వద్దే ఉంచుకున్నారు. కానీ ఏప్రిల్ 7వ తేదీన బాలికకు 8వ తరగతి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. చివరి పరీక్షలు కావడంతో తల్లిదండ్రులు ఆ బాలికను బడికి పంపించారు. అయితే బాలిక పీరియడ్స్ గురించి తెలుసుకున్న ఉపాధ్యాయులు ఆమెను గదిలోకి రానివ్వలేదు

చేసేదేమీ లేక బాలిక కూడా బయటే కూర్చుని పరీక్ష రాసింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లికి ఈ విషయం చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రేకానికి గురైన తల్లి రేపు బడికి వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడతానని చెప్పింది. మరుసటి రోజు విద్యార్థిని బడికి పంపించి 10.30 గంటల సమయంలో తల్లి వెళ్లింది. అయితే అప్పుడు కూడా బాలిక బయటే కూర్చుని పరీక్షలు రాస్తూ కనిపించగా.. తల్లి మెబైల్ ఫోన్ తీసుకుని వీడియో తీయడం ప్రారంభించింది. ఆపై ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి ఇలా ఎందుకు కూర్చుబెట్టారని ప్రశ్నించింది. పీరియడ్స్ వచ్చాయని ఇలా కూర్చోబెట్టామని చెప్పగా.. గొడవకు దిగింది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పింది.

బడిలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. క్షణాల్లోనే ఇది వైరల్ కాగా.. తీవ్ర విమర్శలు గుప్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు, యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీరియడ్స్ మాత్రమే వచ్చాయని.. ఆమెకు ఎలాంటి సమస్య లేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ కాలంలోనూ ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించగలిగారంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాలిక తల్లి దీనిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కూడా జరుగుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆమెతో అమానవీయంగా నడుచుకుని సభ్య సమాజం తలదించుకునేలా చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు