Friday, 7 August 2026

ఢిల్లీలో 15 ఏళ్ళు దాటిన వాహనాలకు బంకుల్లో ఇంధనం బంద్…

కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.

దేశ రాజధానిలో కాలుష్య నివారణకు ఢిల్లీ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31వ తేదీ తర్వాత బంకుల్లో ఇంధనం పోయడం నిలిపివేయాలని నిర్ణయించింది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.

”పెట్రోల్ పంపుల వద్ద గాడ్జెట్‌లు ఏర్పాటు చేస్తాం. వాటి సాయంతో 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తిస్తాం. వాటికి ఇంధనం సరఫరా ఆపేస్తాం” అని మంత్రి తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖకు కూడా తెలియజేశామని చెప్పారు. ఇంధనం సరఫరా ఆంక్షలతో పాటు, ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు తప్పనిసరిగా యాంటీ స్మోగ్ గన్లను అమర్చాలని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సుమారు 90 శాతం సీఎన్‌జీ బస్సులను దశలవారిగా ఉపసంహరించుకుని ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్టు చెప్పారు.

ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్‌లు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలు ఉన్నాయని, వాటన్నింటికీ వెంటనె యాంటీ స్మోగ్ గన్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి చేయనున్నట్టు మంత్రి చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లకు కూడా ఇది వర్తింపజేస్తామని తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు