Friday, 7 August 2026

గోవా పర్యాటకం పడిపోయింది: కారణాలు?

భారత దేశ పర్యాటక రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన గోవా ఇప్పుడు పర్యాటకులు లేక వెలవెలపోతోంది.
గోవా బీచ్ లకు ప్రసిద్ధి చెందింది. ఇవి తాటిచెట్లు, గుడిసెలతో, ఆందమైన ఆకర్షణీయమైన అరేబియా సముద్రంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బాగా బీచ్, కలాంగుట్ బీచ్, అంజునా బీచ్లు గోవాలో అత్యంత ప్రసిద్ధి బీచ్లు. అద్భుతమైన బీచ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో టూరిస్టులను అత్యధికంగా ఆకట్టుకున్న గోవాను బీచ్ స్వర్గం అని పిలుస్తారు. గోవా బీచ్లు అర్థచంద్రాకారంలో, తాటి, కొబ్బరి చెట్లతో నిండివుంటాయి. Beaches వెంబడి రిఫ్రెష్ మెంట్ ను అందించే అనేక షాక్స్ ఉన్నాయి. బంగారు వర్ణం ఇసుక, అక్కడక్కడ గుడిసెలు, వాటర్ స్పోర్ట్స్, నైట్ లైఫ్ తో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంతో దేశ విదేశాల టూరిస్టులను మంత్రముగ్ధులను చేస్తాయి.

గత కొద్దికాలంగా గోవాకు టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కారణాలను విశ్లేషిస్తే.. CEIC రిపోర్టు ప్రకారం.. 2019లో 85లక్షలున్న విదేశీ టూరిస్టులు 2023లో గోవాకు కేవలం 15లక్షలకు తగ్గారు. ఆగ్నేయాసియాలో మరింత అభివృద్ధి చెందిన, తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండటంతో గోవా తన వైభవాన్ని, ఆకర్షణను కోల్పోతోందని భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు వెన్నెముక, విదేశీ పర్యాటకులపై ఎక్కువగా ఆధారపడిన పర్యాటక పరిశ్రమ ఆర్థిక మాంద్యం ఫలితంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

గోవాకు విదేవీ టూరిస్టులు తగ్గడానికి మరో కారణం ఆటో మాఫియా.. గోవా ట్యాక్సీ కంపెనీలు చార్జీలు పెంచడం, మీటర్లు లేకపోవడం, అందించే కొన్ని సంస్థలు పర్యాటకులను అడ్డగోలు ఛార్జీలతో దోచుకోవడం, విదేశీయులతో ఘర్షణలు ఇలా అనేక అంశాలు గోవా టూరిజంపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ ఛార్జీల పారదర్శకత ప్రధాన సమస్యగా మారింది.

గోవా టూరిజంపై ప్రభావం చూపే మరో అంశం ఖర్చులు.. గోవా జీవన వ్యయం బాగా పెరిగింది. బడ్జెట్ టూరిస్టులకు ఇది మరింత ఖరీదైనది. Accommodation, ఫుడ్, ట్రావెల్ ఛార్జీలు పెరగడం వల్ల తక్కువ ధరల్లో విహార యాత్ర చేయాలనుకునేవారికి గోవా దూరమవుతోంది. వీటి కారణంగా చాలా మంది టూరిస్టులు గోవాకు వచ్చేందుకు ఒకటిరెండు సార్లు ఆలోచిస్తున్నారు.

ఒకప్పుడు ప్రశాంతంగా, అందంగా ఉన్న గోవా beaches ఇప్పుడు సందర్శకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ కారణం వల్ల కూడా కొంత విదేశీ పర్యాటకులు తగ్గారని తెలుస్తోంది. 2019లో 85లక్షలున్న విదేశీ టూరిజం 2023లో కేవలం 15లక్షలకు తగ్గింది. విదేశీ పర్యాటక రంగం క్షీణించడంతో పరిష్కార మార్గాలు వెతుకుతున్నాయి స్థానిక కంపెనీలు. విమానాశ్రయాలలో ల్యాండింగ్ ఖర్చులు,వీసా ఫీజులు తగ్గించడం, వీసా- ఆన్ -అరైవల్ విధానాన్ని క్రమబద్ధీకరించడం వంటి విధానాల కోసం పరిశ్రమలోని నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.

ఈ చర్యలతో గోవా థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియాలతో గోవా పోటీ పడుతుందని అంటున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత గోవా విదేశీ పర్యాటకులకు టూరిజం ఎంపికగా ఉండేలా చూడాలని మెరుగైన ప్రజా రవాణా, బీచ్ సౌకర్యాలు, వంటి మౌలిక సదుపాయాల ఆధునీకరించాలని కోరుతున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు