Friday, 7 August 2026

అమెరికాలో కాల్పుల్లో తెలంగాణ విద్యార్ధి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ప్రాణాలు కోల్పోతున్న భారత విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణకు చెందిన యువకుడు అమెరికాలో కాల్పులు జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ అనే 27 ఏళ్ల యువకుడు అమెరికాలో మృతి చెందాడు. ప్రవీణ్‌(27) ఎంఎస్‌ చేయడానికి 2023లో అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ మిల్వాకీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తాజాగా జరిగిన కాల్పుల్లో దుర్మరణం పాలయ్యాడు. ఒక స్టోర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్‌.. మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా కొందరు దుండగులు అందులోకి ప్రవేశించారు. వారిని అడ్డగించడానికి ప్రవీణ్‌ ప్రయత్నించగా తుపాకులతో కాల్పులు జరిపారు. గాయపడిన ప్రవీణ్‌ను మిల్వాకీ పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఆ విషయం తెలిసి అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు