Friday, 7 August 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day)

ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మహిళల హక్కులు, సాధించిన విజయాలు, సమానత్వం, లింగ భేదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గుర్తుచేసేందుకు జరుపుతారు.

1908లో న్యూయార్క్‌లో 15,000 మంది మహిళలు స్వల్ప పని గంటలు, మెరుగైన వేతనం, ఓటు హక్కు కోసం ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా
జరిగాయి.
1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ”ఆహారం – శాంతి” కోసం డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

మహిళల హక్కుల కోసం పోరాడిన ఉద్యమాలను గుర్తించడం, సమానత్వం, లింగ వివక్ష నివారణపై అవగాహన కల్పించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం అనేవి మహిళా దినోత్సవం ఉద్దేశాలు అనుకోవచ్చు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. మార్చ్ ఎనిమిదికి ముందు, తర్వాత మూడు నాలుగు రోజుల పాటు రష్యాలో పువ్వుల కొనుగోళ్లు రెండింతలు అవుతుంటాయి. చైనాలో మార్చి 8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలా మంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది.

ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా ‘ల ఫెస్టా డెల్ల డొన్న’ ను మిమోసా అనే చెట్టుకు పూసే పువ్వులను బహుకరించి జరుపుకుంటారు. అమెరికాలో అయితే మార్చి నెల మహిళల చరిత్ర నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు