Friday, 7 August 2026

75 కోట్ల డ్రగ్ స్మగ్లింగ్ లో విదేశీ మహిళలు అరెస్ట్…

కర్ణాటక (Karnataka) లో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ (Drugs) అక్రమరవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు విదేశీ మహిళలను అరెస్టు చేశారు. బెంగుళూరు విమానాశ్రయంలో వీరి నుంచి రూ.75 కోట్ల విలువైన 37 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళలను నైజీరియాకు చెందిన బాంబా ఫాంటా (31), అబిగైల్ అడోనిస్ (30)గా గుర్తించారు.

డిల్లీ నుంచి ఎండీఎంఏను ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు మంగుళూరు పోలీస్ కమీషనర్ అనుపమ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీరి నుంచి మొబైల్ ఫోన్లు, పాస్ పోర్టులతో పాటు రూ.18వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

వీరిద్దరూ డిల్లీలో నివాసం ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విమానాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ ను పలుప్రాంతాలకు రవాణా చేస్తున్నారని, ఏడాది కాలంలో ముంబయికి 37 సార్లు, బెంగుళూరుకు 22సార్లు విమాన ప్రయాణాలు చేసినట్లు పోలీసులు వివరించారు. 2020లో ఫాంటా అనే మహిళ బిజినెస్ వీసాపై భారత్ కు రాగా, 2016 నుంచే అడోనిస్ భారత్ లో ఉంటున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ డ్రగ్స్ ముఠాలో భాగస్వాములయ్యారని అగర్వాల్ తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు