Saturday, 8 August 2026

కుంభమేళాలో 30 కోట్లు సంపాదించిన ఓ కమ్యూనిటీ…

ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన 45 రోజుల మహా కుంభమేళాలో, 130 పడవలతో సేవలు అందించిన ఒక కుటుంబం (కమ్యూనిటీ) సుమారు రూ.30 కోట్లు సంపాదించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే ఈ విషయం పడవలు నడిపే వారితో మాట్లాడినప్పుడు ఒక కుటుంబం కాదు 100 కుటుంబాల కమ్యూనిటీ అని సుమారు 130 బోట్స్ ఉన్నాయి అని చెప్పారు. గతంలో యాభైవేల నుండి లక్ష సంపాదిస్తే కుంభమేళా సమయంలో అయిదు లక్షల నుండి ఎనమిది లక్షల వరకు సంపాదించినట్లు చెప్పారు. ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగిసింది. ఈ సమయంలో సుమారు 66 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. మొత్తం రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి, హోటల్ పరిశ్రమకు రూ.40 వేల కోట్లు, ఆహారం మరియు ఇతర నిత్యావసరాల రంగానికి రూ.33 వేల కోట్లు, రవాణా రంగానికి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు