Friday, 7 August 2026

పార్టీ నుండి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి…

లక్నో: తాను బతికున్నంత కాలం పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండబోరని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆమె.. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘ఎక్స్’ వేదిగా వెల్లడించారు. పార్టీకి సంబంధించి అన్ని కీలక పదవుల నుంచి అతడిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజులోపే బీఎస్పీ అధినేత్రి ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

అంతకు ముందురోజు ఇదే విషయంపై మాయావతి మాట్లాడుతూ.. తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే తొలగిస్తానన్నారు. బీఎస్పీని రెండు వర్గాలుగా చీల్చి, బలహీనపరిచే ప్రయత్నం చేసిన ఆకాశ్ మామ అశోక్ సిద్దార్ధ్ ను ఈ నియమానికి అనుగుణంగానే గత నెల పార్టీ నుంచి బహిష్కరించామన్నారు.. ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్ పైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తన సోదరుడు ఆనంద్ కుమార్ మాత్రం పార్టీ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదన్న ఆమె.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్ కుమార్ తో పాటు రాజ్యసభ సభ్యుడు రామా గౌతమ్ ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు