Friday, 7 August 2026

తమిళనాడు బడ్జెట్ లో Rupee Symbol మాయం

తమిళ బడ్జెట్ లో భారత రూపాయి “₹” (Rupee Symbol) గుర్తుకు బదులుగా ‘రూ’ (ரு என்று) గుర్తును వాడారు. ఇది కేంద్రప్రభుత్వం హిందీ రుద్దడానికి వ్యతిరేకంగా తమిళనాడు సర్కారు సమాధానంగా చూడవచ్చనే చర్చ మొదలైంది.

ఎమ్.కే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం గురువారం రాష్ట్ర 2025-26 బడ్జెట్ లోగోలో రూపాయి చిహ్నమైన “₹” ను తమిళ లిపిలోని “రూ” (ரு என்று) తో భర్తీచేసింది. తమిళనాడు ప్రభుత్వం మార్చి 14న ప్రవేశపెట్టడానికి ముందు ఈ చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు మ‌రో కొత్త వివాదం మొద‌లైంది.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఎన్ఈపీ త్రి భాషా విధానంపై విభేదిస్తున్నాయి. ఇలాంటి సంయంలో త‌మిళ‌నాడు స‌ర్కారు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను అంగీక‌రించేది లేద‌నే సంకేతాలు పంపుతూ, రూపాయి సింబ‌ల్ ను త‌మిళ అక్ష‌రం రూ తో రీప్లేస్ చేయడం గమనించాల్సిన విషయం. తమిళనాడు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు శుక్రవారం 2025-26 బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

తమిళనాడులో మూడు భాషల విధానాన్ని అమలుచేయడానికి కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అదే సమయంలో పాఠశాల పాఠ్య ప్రణాళికలో హిందీ భాషను చేర్చడానికి తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. దీని కారణంగా తమిళనాడుకు రావాల్సిన 2,152 కోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వం నిలిపివేసిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ సమస్యపై పార్లమెంటులో డీఎంకే ఎంపీలు నిరసనలు చేస్తున్నారు. ఇంకా డీఎంకే – బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య స్టాలిన్ సర్కారు శుక్రవారం తమిళనాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన ప్రకటనలు వస్తాయని భావిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు