Saturday, 8 August 2026

డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్…

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్పు వెల్లడించారు.

అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ కీలక తీర్పును వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. దీంతో, ట్రంప్ కు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు