Friday, 7 August 2026

చెప్పులు దాచి పెడితే రూ.5 వేలేనా? పెళ్లి కుమారుడిపై దాడి

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన వివాహ వేడుకలో ‘జూతా చుపాయి’ (చెప్పులు దాచిపెట్టడం) అనే సంప్రదాయం వివాదానికి దారి తీసింది. ఈ సంప్రదాయం ప్రకారం, పెళ్లి తంతులో పెళ్లి కుమారుడి చెప్పులను పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు దాచిపెట్టి, వాటిని తిరిగి పొందడానికి డబ్బు కోరుతారు.​ ఇదొక సరదా ప్రక్రియ నిజానికి.

ఉత్తరాఖండ్ లోని చక్రతాకు చెందిన వరుడు మహమ్మద్ షబ్బీర్ కు ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన యువతితో వివాహం జరిగింది. ఈ సందర్భంలో పెళ్లి కుమార్తె సోదరి పెళ్లి కుమారుడి చెప్పులను దాచిపెట్టి, వాటిని తిరిగి ఇవ్వడానికి రూ. 50,000 డిమాండ్ చేసింది. అయితే, పెళ్లి కుమారుడు మహమ్మద్ షబీర్ రూ. 5,000 మాత్రమే ఇచ్చాడు. దీనిపై పెళ్లి కుమార్తె కుటుంబంలోని కొన్ని మహిళలు అతనిని ‘బిచ్చగాడు ‘ అని నిందించారు. దానితో మగ పెళ్లివారు “మీరు పెట్టిన బంగారం నాణ్యత ఎంత” అంటూ నిలదీశారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది, చివరకు పెళ్లి కుమారుడిని ఓ గదిలో బంధించి కర్రలతో దాడి చేశారు. రెండు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో పరస్పరం కంప్లెయింట్ ఇచ్చుకున్నారు.​ ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చమ్రని పోలీసులు వెల్లడించారు.

ఈ సంఘటన పెళ్లి వేడుకల్లో సంప్రదాయాల పేరుతో డబ్బు డిమాండ్ చేసే విధానంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు