Friday, 7 August 2026

విశాఖలో దారుణం : ప్రేమోన్మాది దాడి. తల్లి మృతి – కుమార్తెకు గాయాలు.

మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్వయంకృషి నగర్ లో ఓ యువతి, ఆమె తల్లిపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడి యువతి, ఆమె తల్లిపై క్రూరంగా దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి (43) అక్కడికక్కడే చనిపోగా తీవ్రగాయాలైన దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. దీపిక డిగ్రీ చదివి ఇంట్లోనే ఉంటోంది. యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.

ప్రేమోన్మాది దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశాఖపట్నం CP Sankhabrata Bagchi (శంఖబ్రత బాగ్చి) తో  ఫోన్ లో మాట్లాడి దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రేమోన్మాదిని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు