Friday, 7 August 2026

UKని వీడాలన్న ఆలోచనలో లక్ష్మీ మిట్టల్?

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ బ్రిటన్ ని వీడనున్నట్లు తెలిసింది. మూడు దశాబ్దాలుగా బ్రిటన్ లోనే నివసిస్తున్న లక్ష్మీ మిట్టల్ కొత్త ప్రభుత్వ నిర్ణయంతో ఆ దేశాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నట్లు, ఆయన బాటలోనే మరికొందరు సంపన్నులు నడవనున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి.

బ్రిటన్లో Non-Dome-Tax విధానాన్ని రద్దు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పన్ను విధానం ప్రకారం UK నివాసితులు తాము విదేశాలలో సంపాదించిన మొత్తానికి ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 226 సంవత్సరాల నుండి ఈ పన్ను విధానం అమలులో వుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఆ దేశ సంపన్నులను ఆలోచనలో పడేసింది. వారు పన్ను మినహాయింపులకు స్వర్గధామంలా వుండే దేశాల వైపు చూసేలా UK కొత్త ప్రభుత్వం నిర్ణయం పురికొల్పింది. అలా చూస్తున్నవారిలో లక్ష్మీ మిట్టల్ కూడా వున్నట్లు వార్తలు వచ్చాయి.

“Sunday Times” గతేడాది విడుదల చేసిన సమాచారం ప్రకారం లక్ష్మీ మిట్టల్ కి 14.9 బిలియన్ పౌండ్ల సంపద వుంది. ఆయనకి బ్రిటన్లోనూ, అమెరికాలోనూ అపారమైన ఆస్తులు వున్నాయి. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం UK ప్రభుత్వ కొత్త నిర్ణయంతో ఆయన UAE, స్విట్జర్లాండ్, ఇటలీలలో ఏదో ఒక దేశానికి తన మకాం మార్చాలని యోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఇలా పారిశ్రామికవేత్తలు దేశాన్ని వీడి వెళ్లిపోవడం దేశ ఆర్ధికాభివృద్ధికి ఒక క్లిష్టమైన సవాలేనని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు